పెళ్లిచూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో వంటి విభిన్నకథాచిత్రాలను నిర్మించి, అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న యష్ రంగినేని నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘చాంపియన్’ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే మరికొన్ని చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రల కోసం యష్ రంగినేనిని దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నట్టు తెలిసింది. మంగళవారం యష్ రంగినేని పుట్టినరోజు. ఈ సందర్భంగా మంచి పాత్రలతో తనను ప్రోత్సహిస్తున్న దర్శక,నిర్మాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయని, కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో, కొన్ని చర్చల దశలో ఉన్నాయని యష్ రంగినేని చెప్పారు.