వైవాహిక లైంగికదాడిపై చట్టాలేవీ?
వైవాహిక బంధం మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి, వారి హక్కులకే భంగం కలిగిస్తున్నది. భార్య సమ్మతి లేకుండా భర్త బలవంతంగా శారీరకంగా కలిస్తే, దాన్ని లైంగిక దాడిగా గుర్తించని చట్టాలు ఇంకా అమల్లో ఉన్నాయి. కాలం మారుతున్నా, వలస పాలన నాటి చట్టాలు మహిళల రక్షణకు అడ్డంకిగా నిలుస్తున్నాయి.
- లక్షలాది మహిళలకు రక్షణ కరువు
- దక్షిణాసియాలో దారుణ పరిస్థితులు
- 100 దేశాల్లో నేరంగా గుర్తింపు
- భారత్‌లో చట్టపరమైన మినహాయింపు!
న్యూఢిల్లీ: వైవాహిక బంధం మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి, వారి హక్కులకే భంగం కలిగిస్తున్నది. భార్య సమ్మతి లేకుండా భర్త బలవంతంగా శారీరకంగా కలిస్తే, దాన్ని లైంగిక దాడిగా గుర్తించని చట్టాలు ఇంకా అమల్లో ఉన్నాయి. కాలం మారుతున్నా, వలస పాలన నాటి చట్టాలు మహిళల రక్షణకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. దక్షిణాసియాలో లక్షలాది మహిళలు ఇటువంటి పరిస్థితుల్లో చట్టపరమైన భరోసా లేకుండా జీవిస్తున్నారు. భాగస్వాముల నుంచి మహిళలు ఎదుర్కొంటున్న హింస ప్రపంచ సగటు కంటే 35 శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. వైవాహిక అత్యాచారంపై చట్టాలు, మహిళల హక్కులపై తాజాగా వెలువడిన అధ్యయనం ఈ చేదు వాస్తవాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
దక్షిణాసియాలో లక్షలాది మంది మహిళలు, బాలికలకు వైవాహిక అత్యాచారం నుంచి చట్టపరమైన రక్షణ లభించడం లేదని ’సమాజ్” మహిళా హక్కుల సంఘాల కూటమి తాజా అధ్యయనం వెల్లడించింది. ఎనిమిది దక్షిణాసియా దేశాల్లో భాగస్వాముల నుంచి మహిళలు ఎదుర్కొంటున్న హింస ప్రపంచ సగటు కంటే 35 శాతం అధికంగా ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు వైవాహిక లైంగిక దాడిని నేరంగా గుర్తించగా, భారత్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఇప్పటికీ పూర్తిస్థాయి నిషేధం లేదు. మాల్దీవుల్లో మాత్రం వివాహ బంధంలో జరిగే లైంగిక దాడికి ఇతర అత్యాచారాల మాదిరిగానే శిక్ష విధిస్తున్నారు. నేపాల్, భూటాన్ దీనిని నేరంగా గుర్తించినా తక్కువ శిక్షలే అమలు చేస్తున్నాయి.
దక్షిణాసియాలో ప్రస్తుతం అమల్లో ఉన్న వైవాహిక అత్యాచార చట్టాలు బ్రిటిష్ పాలన కాలం నాటివని అధ్యయనం పేర్కొంది. భారత్, బంగ్లాదేశ్‌లలో 1860 నాటి చట్టాలు, శ్రీలంకలో 1885 నాటి చట్టాలు భర్తకు మినహాయింపునిస్తున్నాయి. భారత్‌లో ఈ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పది పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై డిసెంబర్ 9 నుంచి తుది విచారణ జరగనుంది. అయితే, ఈ నేరాన్ని చట్టబద్ధంగా గుర్తించడం కుటుంబ వ్యవస్థకు, మతపరమైన విలువలకు విఘాతమని కేంద్ర ప్రభుత్వం, కొన్ని మత సంస్థలు, పురుషుల హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్థాన్ 2006లో ఈ మినహాయింపును తొలగించినప్పటికీ, అక్కడ చట్టపరమైన స్పష్టతపై సందేహాలున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

