ఇండో-టిబెట్ సరిహద్దు గ్రామం.. మంచు ప్రదేశాల స్థలం!
ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఓ అందమైన గ్రామం కొలువుదీరింది. అదే ‘మున్సియారి’. అంటే స్థానిక భాషలో ‘హిమపాతం జరిగే చోటు’ లేదా ‘మంచు ప్రదేశాల స్థలం’ అని అర్థం. టూరిస్టులకు, ప్రకృతి ప్రేమికులకు ఇదో పర్యాటక ప్రదేశం.
పల్లెటూర్
మనసు దోచే.. మున్సియారి
మనదేశంలో అద్భుతమైన పర్వత పర్యాటక కేంద్రాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే తమ సహజ సౌందర్యాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటున్నాయి. టూరిస్టులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అలాంటి ఒక అపురూపమైన హిమాలయ లోయ ప్రాంతమే.. ఉత్తరాఖండ్‌లోని మున్సియారి. అద్భుతమైన హిమ శిఖరాలు, దట్టమైన అడవులు, జలపాతాలు, అరుదైన గిరిజన సంస్కృతికి నిలయమైన ఈ ఊరే.. ఈ వారం మన పల్లెటూరు!
నగర కోలాహలం, ట్రాఫిక్ శబ్దాలకు దూరంగా, స్వచ్ఛమైన గాలిలో కొద్దిరోజులు ప్రశాంతంగా గడపాలని భావిస్తే.. మున్సియారికి ప్రయాణం కట్టాల్సిందే! ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిథోరాగఢ్ జిల్లాలో, ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఈ అందమైన గ్రామం కొలువుదీరింది. ‘మున్సియారి’ అంటే స్థానిక భాషలో ‘హిమపాతం జరిగే చోటు’ లేదా ‘మంచు ప్రదేశాల స్థలం’ అని అర్థం.

Munsiyari Beauty
కట్టిపడేసే ఆకర్షణలు
మున్సియారిలో ప్రధాన ఆకర్షణ.. ఇక్కడి నుంచి కనిపించే ‘పంచచూలి’ పర్వత శ్రేణులు. ఐదు మంచు శిఖరాలు ఒకదాని పక్కన ఒకటి పొయ్యి మీద వంట కుండల్లా దర్శనమిస్తాయి. స్థానికులు వీటిని పాండవులు వంట చేసుకున్న స్థలంగా నమ్ముతారు. తెల్లటి మంచు దుప్పటి కప్పుకొని ఉండే ఈ పర్వత శిఖరాలు.. సంధ్యాసమయంలో పడే సూర్యకిరణాలతో అరుణ వర్ణంలోకి మారిపోతాయి. ఇక మధ్యాహ్నపు ఎండకు బంగారు వన్నెలో మెరిసిపోతాయి. ఈ రెండు దృశ్యాలను చూడటం.. జీవితంలో మరిచిపోలేని ఒక మధురానుభూతి. వీటిని వీక్షించేందుకే ఇక్కడికి పర్యాటకులు క్యూ కడుతుంటారు.
ట్రెక్కింగ్‌కు స్వర్గధామం: సాహస క్రీడలు ఇష్టపడేవారికీ ఈ ప్రాంతం ఒక అద్భుతమైన గమ్యస్థానం. మిలామ్ గ్లేసియర్, రాలమ్ గ్లేసియర్, నందా దేవి పర్వత పాదాల వద్దకు వెళ్లే టెక్కింగ్ ట్రైల్స్.. ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి.
ఖాలియా టాప్: మున్సియారికి కొద్ది దూరంలో, ట్రెక్కింగ్ ద్వారా చేరుకోగల ప్రాంతం.. ఖాలియా టాప్. ఇక్కడి నుంచి హిమాలయాల విస్తృత సౌందర్యం కనువిందు చేస్తుంది. శీతకాలంలో ఇక్కడ మంచు కురుస్తుండటంతో స్కీయింగ్ చేయడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు.
బర్తీ జలపాతం: మున్సియారికి వెళ్లే మార్గంలో దట్టమైన అడవుల మధ్యలో ఉంటుందీ జలపాతం. దాదాపు 126 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దూకే బర్తీ జలపాతం.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Khalia Top, Barthi Falls
భోటియా జీవనశైలి
ఈ ప్రాంతంలో ప్రధానంగా ‘భోటియా’ తెగ ప్రజలు నివసిస్తారు. వీరి జీవనశైలి చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఒకప్పుడు వీరు టిబెట్‌తో ఉన్ని, ఉప్పు వ్యాపారాలు చేసేవారు. ఇక్కడి మహిళలు గొర్రె ఉన్నిని ఉపయోగించి.. తమ స్వహస్తాలతో తయారు చేసే రగ్గులు, కంబళ్లు, షావల్స్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక, మున్సియారికి వచ్చి ప్రశాంతంగా గడపాలనుకునే వారికి.. స్థానికులే గొప్ప ఆతిథ్యం అందిస్తారు. స్థానిక గిరిజన వంటకాలు, ఆర్గానిక్ ఆహారంతో పర్యాటకులకు సరికొత్త రుచిని అందిస్తారు.
ఎలా వెళ్లాలి?
మున్సియారికి సమీపంలోని ప్రధాన పట్టణాలు.. ఉత్తరాఖండ్‌లోని పంత్నగర్, కత్గోడమ్. ఇక్కడి నుంచి టాక్సీలు, బస్సుల ద్వారా.. పిథోరాగఢ్ మీదుగా మున్సియారి చేరుకోవచ్చు. మార్చి నుంచి జూన్ వరకు (వేసవి కాలం) ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు భారీగా మంచు కురుస్తుంది. హిమగిరుల అందాలను ఆస్వాదించాలనుకునే వారికి.. ఇది పర్ఫెక్ట్ టైమ్.

Bhotia Lifestyle
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

