ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన సెటైరికల్ థ్రిల్లర్ ‘సుయోధన’. సీనియర్ నటుడు సాయికుమార్, సీనియర్ నటి ప్రేమ ఇందులో కీలక పాత్రలు పోషించారు. వై.ఎస్.మాధవరెడ్డి దర్శకుడు. బోసుబాబు నిడుమోలు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యమైన కథ, కథనాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించామని, అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా సినిమా ఉంటుందని, ఇకనుంచి ప్రచారం ముమ్మరం చేస్తామని నిర్మాత బోసుబాబు నిడుమోలు తెలిపారు. విష్ణు, దేవిప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ కొప్పెర, సంగీతం: జై క్రిష్, నిర్మాణం: ప్రజ్వల లైన్ క్రియేషన్స్.