రాంచీ: జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు కార్మికులు పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌లోని ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఆ దేశంలో వారు కిడ్నాప్ అయ్యారు. అయితే 8 నెలల తర్వాత సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. (Labourers Kidnapped In Niger Return) జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలోని బాగోదర్కు చెందిన ఫల్జిత్ మహతో, రాజు కుమార్, చంద్రిక మహతో, సంజయ్ మహతో, ఉత్తమ్ మహతో గత ఏడాది ఆఫ్రికా దేశమైన నైజర్ వెళ్లారు. ట్రాన్స్మిషన్ లైన్లు వేసే ఒక ప్రైవేట్ కంపెనీలో వారు పని చేస్తున్నారు.
కాగా, 2025 ఏప్రిల్ 27న జార్ఖండ్‌కు చెందిన ఈ ఐదుగురు కార్మికులు నైజర్‌లో కిడ్నాప్ అయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న వారి కుటుంబాలు ప్రభుత్వ సహాయాన్ని కోరాయి. సీఎం హేమంత్ సోరెన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వలస కార్మికుల నియంత్రణ అధికారులు నైజర్‌లోని ప్రైవేట్ కంపెనీని సంప్రదించారు. నైజర్‌లోని భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయంతో కిడ్నాపర్ల చెర నుంచి వారిని విడిపించారు.
మరోవైపు సుమారు 8 నెలల తర్వాత నైజర్‌లో కిడ్నాపైన జార్ఖండ్ కార్మికులు జనవరి 9న విమానంలో ముంబై చేరుకున్నారు. ఆరోగ్య పరీక్షలు, అవసరమైన ప్రభుత్వ, చట్టపరమైన లాంఛనాల తర్వాత జనవరి 14న జార్ఖండ్‌లోని వారి సొంతూరు చేరుకుంటారని ఆ రాష్ట్ర వలస కార్మికుల నియంత్రణ అధికారి తెలిపారు.
Also Read:
Dalit Woman Murdered, Daughter Kidnapped | దళిత మహిళను హత్య చేసి.. ఆమె కుమార్తెను కిడ్నాప్
Watch: బస్సును ఓవర్ టేక్ చేసేందుకు బైకర్ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?