Kavya Kalyanram | కీరవాణి కొడుకుతో పీకల్లోతు ప్రేమ… బలగం హీరోయిన్ పెళ్లి వార్తలు వైరల్
Kavya Kalyanram | తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ఆ తర్వాత హీరోయిన్గా మారి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. చిన్నప్పుడే పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, పెద్దయ్యాక హీరోయిన్గా కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది.
Kavya Kalyanram | తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ఆ తర్వాత హీరోయిన్గా మారి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. చిన్నప్పుడే పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, పెద్దయ్యాక హీరోయిన్గా కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. హీరోయిన్గా ఆమె చేసిన మసూద, బలగం, ఉస్తాద్ వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా ‘బలగం’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో కావ్యకు మరింత క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం కూడా ఆమె పలు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా కావ్య చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి గురించి టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెద్ద కుమారుడు, గాయకుడు ,సంగీత దర్శకుడు కాళ భైరవతో కావ్య ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాల భైరవ మొదట గాయకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించి మంచి గుర్తింపు సంపాదించాడు. తర్వాత సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభను చూపిస్తూ వరుసగా సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాలీవుడ్లో మంచి స్థానం సంపాదించుకుంటున్నాడు.
ఇక గత కొన్నేళ్లుగా కాల భైరవ మరియు కావ్య కళ్యాణ్ రామ్ మధ్య స్నేహం ప్రేమగా మారిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారని, ఇప్పటికే ఇరు కుటుంబాలు కూడా వారి ప్రేమను అంగీకరించాయని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని కూడా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కీరవాణి కుటుంబంలో మరో పెళ్లి కూడా జరిగింది. ఆయన చిన్న కుమారుడు సింహా కోడూరి ప్రముఖ నటుడు మురళి మోహన్ మనవరాలిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెద్ద కుమారుడు కాల భైరవ పెళ్లి కూడా జరగబోతుందన్న వార్తలు వినిపిస్తుండటంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై కావ్య కళ్యాణ్ రామ్ లేదా కాల భైరవ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వీరి ప్రేమ, పెళ్లి వార్తలు నిజమా కాదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

