లక్నో: ఒక యువకుడు దళిత మహిళను హత్య చేశాడు. ఆమె కుమార్తెను కిడ్నాప్ చేశాడు. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో యువతిని కాపాడి నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. (Dalit Woman Murdered, Daughter Kidnapped) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 8న కప్సద్ గ్రామానికి చెందిన దళిత మహిళ, 20 ఏళ్ల కుమార్తె కలిసి నడుస్తూ తమ పొలానికి వెళ్తున్నారు. స్థానిక వైద్యుడి వద్ద కాంపౌండర్‌గా పనిచేసే 22 ఏళ్ల పారస్ కాలువ గట్టు వద్ద ఆ మహిళలను అడ్డుకున్నారు. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన ఆమె తల్లిపై కొడవలితో దాడి చేశాడు. యువతిని కిడ్నాప్ చేసి పారిపోయాడు.
కాగా, గాయపడిన దళిత మహిళ అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆ గ్రామంలోని దళిత కుటుంబాలు ఆగ్రహంతో రగిలిపోయాయి. భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఆమె కుమార్తెను రక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారులు, రాజకీయ నేతల హామీతో నిరసన విరమించారు. దళిత మహిళ మృతదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు నిందితుడు పారస్‌కు మరికొందరు వ్యక్తులు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాపైన యువతిని కాపాడేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. అయితే సీఎం ఆదిత్య నాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలైన బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ మండిపడ్డాయి. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించాయి.
Also Read:
Watch: అన్న ఇంటికి నిప్పంటించేందుకు తమ్ముడు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?