కట్టంగూర్, మార్చి 12 : కన్న కూతుళ్లును చూసి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతి చెందాడు. మండలంలోని కల్మెర గ్రామ శివారులో గురువారం జరిగిన ప్రమాదంలో అక్కెనపల్లి యాదయ్య (59) ప్రాణాలు విడిచాడు.
ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్ పల్లి మండలం షాపల్లి గ్రామానికి చెందిన అక్కెనపల్లి యాదయ్య (59) కట్టంగూర్‌లో ఉన్న తన కూతుళ్లను కలిసేందుకు టీవీఎస్ స్కూటీపై వచ్చాడు. అనంతరం తిరిగి స్వగ్రామం వెళ్తుండగా కల్మెర గ్రామశివారులో ప్రమాదవశాత్తు స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన యాదయ్యను స్థానికులు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్ననట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.