Dial 112 | హైదరాబాద్ : తెలంగాణలో ‘డయల్ 100’ స్థానంలో ఇక కొత్త ఎమర్జెన్సీ నంబర్ వచ్చింది. ఇకపై అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఒకే నంబర్ ‘112’ అందుబాటులో ఉండనుంది. పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలకుగాను ‘డయల్ 112’ ఎమర్జెన్సీ నంబర్‌ను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కమాండ్ కంట్రోల్ సెంటర్ టవర్ Bలో రెండు ఫ్లోర్లను డయల్ 112కి కేటాయించామని తెలిపారు. డయల్ 100ను 2013లో కొంపల్లిలో GVK వారి సాయంతో ప్రారంభించామన్నారు. వివిధ అత్యవసరాలకు ఒకే నెంబర్ ఉండాలని గతంలో కేంద్రం సూచించిందని.. తెలంగాణ ఏర్పడిన తరువాత టెక్నికల్ డెవలప్ మెంట్ చేస్తూ వచ్చామని పేర్కొన్నారు. ఇటీవల AI వచ్చాక అనేక పనులు సలువుగా మారాయి. న్యాయ సాయం, వైద్య సాయం, సైబర్ సాయం.. అనేక సమస్య పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గం చూపిస్తుందని తెలిపారు.
డయల్ 112 వచ్చినపుడు పోలీసులు ఆ కాల్‌ను ఎట్టి పరిస్థితుల్లోను తిరస్కరించడానికి వీల్లేదు..డయల్ 112 కాల్ రాగానే కాలర్ లొకేషన్ కోసం అడ్వాన్స్ అల్స్ వాడుతున్నాము. డ్రోన్ బెస్డ్ టెక్నీకల్ సిస్టాన్ని త్వరలోనే తెలంగాణ పోలీసులు ఉపయోగించుబోతున్నారన్నారు. డ్రోన్ టీమ్‌ను సైతం ఫామ్ చేయబోతున్నాము. బేసిక్ పోలిసింగ్ లాగా టెక్నాలజీ పోలిసింగ్‌ను తీసుకువస్తున్నాము. డయల్ 112 అనేది 3.0 వెర్షన్ గా ఉంటుంది. యువ IPSలు, AI టెక్నాలజీ వాడే వారిని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామని డీజీపీ స్పష్టం చేశారు.
NextGen Dial-112 Official Launch | TGICCC | LIVE | Telangana Police https://t.co/GpwLoWKhym
— Telangana Police (@TelanganaCOPs) August 5, 2026