తిరుమల : వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లోని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్( Hyderabad ) కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం రూ.2 కోట్లు విరాళం( Donations ) గా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థకు చెందిన దాతలు ఆర్.సీతారామ్ రెడ్డి, జి.కవిత, త్రినయ్ రెడ్డి, త్రిభువన్ రెడ్డి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.