వెంగళరావునగర్, మార్చి 10 : ఓ కన్సల్టెన్సీ ఇప్పించిన ఉద్యోగం నచ్చని యువకుడు తాను చెల్లించిన సొమ్మును వాపస్ ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. నిర్వాహకులు మొత్తం కాకుండా ఓ వెయ్యి రూపాయలను ఫీజు కింద ఉంచుకోవడంతో ఆవేశానికి లోనైన దుండగుడు కన్సల్టెన్సీ నిర్వాహకుడిని కత్తితో పొడిచి కడతేర్చాడు. మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధురానగర్ మెట్రోస్టేషన్ ఎదురుగా మిట్ట మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుం ది. పోలీసుల కథనం ప్రకారం.. మధురానగర్ మెట్రోస్టేషన్ పిల్లర్ నం.1482 వద్ద శశికిరణ్‌రెడ్డి (36) వారాహి అనే కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. ఇతని వద్దకు విశాఖపట్నంకు చెందిన ప్రభుకుమార్ (19) ఉ ద్యోగం కావాలని వచ్చాడు. హెల్పర్ ఉద్యోగం ఉన్నదని చెప్పి.. కన్సల్టెన్సీ వారు అతని వద్ద రూ.2500 ఫీజు కింద తీసుకున్నారు.
హెల్పర్‌గా రెండు రోజులు పనిచేసిన ప్రభుకుమార్ తనకు ఆ ఉద్యోగం నచ్చలేదని, తాను చెల్లించిన రూ.2500 తి రిగి ఇచ్చేయాలని పట్టుబట్టాడు. కన్సల్టెన్సీ నిర్వాహకులు రూ.1500ను ఫోన్‌పే ద్వా రా తిరిగి చెల్లించారు. మిగిలిన రూ.1000 తమ ఫీజు అని తిరిగిచ్చేది లేదని స్పష్టంచేశారు. దీంతో నిర్వాహకులకు, ప్రభుకుమార్‌కు వాగ్వాదం పెరిగింది. ఆవేశానికి లో నైన ప్రభుకుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో శశికిరణ్‌రెడ్డి మెడపై బలంగా వేటు వేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి శశికిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ హఠాత్పరిణామాన్ని గమనించిన రిసెప్షనిస్ట్ లయ అనే యువతి ఆ యువకుడిని అడ్డుకోబోగా.. ఆమెపై కూడా కత్తితో దాడిచేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన లయ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసిం ది. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు అడిషనల్ డీసీపీ తెలిపారు.