– నల్లగొండ 48వ డివిజన్ కార్పోరేటర్ యమా కవితారాణీ దయాకర్
నీలగిరి, ఆగస్టు 03 : తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించాలని నల్లగొండ 48వ డివిజన్ కార్పోరేటర్ యమా కవితారాణీ దయాకర్ అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని పానగల్ సెక్టార్ పరిధిలోని రామగిరి, చర్లపల్లి సెక్టార్ పరిధిలోని రవీంద్రనగర్, కామేశ్వర్రావు కాలనీ, శివరాంనగర్ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను వేర్వేరుగా ఘనంగా నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తల్లులు, గర్భిణీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం అమె మాట్లాడుతూ.. తల్లి పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయని, పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలన్నారు. కనీసం ఆరు నెలలు బిడ్డకు తల్లిపాలు పట్టించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

‘తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి’
అలా పడితేనే బిడ్డ సంపూర్ణ అరోగ్యంతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. తల్లిపాల వల్ల చిన్నారుల్లో రోగ నిరోదక శక్తి పెరిగి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారన్నారు. తల్లి పాలలో అనేక పోషకాలు, ఎంజైములు, హార్మోన్లు సమపాళ్లలో లభిస్తాయని తెలియజేశారు. 8 నెలలు నిండిన తర్వాత అదనపు ఆహారం అందిస్తూ 2 సంవత్సరాల వరకు తల్లి పాలు పట్టించాలన్నారు. చిన్నారులకు పోషక ఆహారాలను అందించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సూపర్వైజర్లు మర్రి జయమ్మ, లక్ష్మమ్మ, పోషణ్ అభియాన్ సిబ్బంది శ్రీదేవి, అంగన్వాడీ టీచర్లు శ్రీలక్ష్మీ, రజిత, సుశీల, శిరీషా, ఆయాలు భానుచంద్ర, యశోద, జ్యోతి, ఆశా వర్కర్లు మమత, ధనలక్ష్మీ, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు మేళ్ల జ్యోతి, పి.రేణుక, గన్నోజు శ్వేత, కర్నాటి రాజేశ్వరి, పగిళ్ల శివాణీ, జ్యోతి, ప్రమీలా పాల్గొన్నారు.

‘తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి’