Bigg Boss Telugu 10 | టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, తమిళనాడు సీఎం, అగ్ర నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్-హైస్ట్ ఎంటర్టైనర్ చిత్రం ‘సిగ్మా’ (Sigma). కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం బిగ్ బాస్ వేదికను సందర్శించింది.
ఈ చిత్రంలో హీరోగా నటించిన సందీప్ కిషన్, దర్శకుడిగా పరిచయం అవుతున్న జేసన్ సంజయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెట్స్‌లో కింగ్ నాగార్జునను కలిసి ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ చిత్రం ‘సిగ్మా’ అధికారిక ట్రైలర్‌ను నాగార్జునకు చూపించి ఆయన ప్రశంసలు అందుకున్నారు. షోలో నాగార్జునతో కలిసి ఈ టీమ్ సందడి చేయడమే కాకుండా, హౌస్‌మేట్స్‌తో సరదాగా గడిపిన ఎపిసోడ్ ఈ రాత్రి టెలికాస్ట్ కానుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించగా, తమన్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘సిగ్మా’ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.