Supreme Court | రోడ్ల వెంట పాదచారులు నడిచేందుకు దారివ్వండి.. కేంద్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం
Supreme Court | పాదచారులకు (Pedestrians) రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడంవల్ల ప్రమాదాలు జరుగుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం ఆక్రమణలు లేని స్థలాన్ని (Encroachment-Free Space) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Supreme Court : పాదచారులకు (Pedestrians) రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడంవల్ల ప్రమాదాలు జరుగుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం ఆక్రమణలు లేని స్థలాన్ని (Encroachment-Free Space) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాదచారులు నడిచే మార్గం మోటార్ వాహనాలు ప్రయాణించే మార్గానికి విడిగా ఉండాలని పేర్కొంది. విడిగా మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వీలుకాని ప్రదేశాల్లో రోడ్లకు, ప్రజలు నడిచే ప్రదేశానికి మధ్య తాడు అయినా కట్టాలని సూచించింది.
రహదారుల పక్కన ఉండే ఖాళీ స్థలం తమ కోసమేనని, వాహనాల బెడద లేకుండా స్వేచ్ఛగా నడవగలమని పాదచారులకు నమ్మకం కలిగించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. అనంతరం పాదచారుల కోసం చేసిన ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విషయాన్ని తదుపరి విచారణ కోసం రెండు వారాలకు వాయిదా వేసింది. ఫుట్‌పాత్‌లపై నడవడం కూడా ప్రజల ప్రాథమిక హక్కులలో భాగమని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

