లక్నో: మాంసం అమ్మే వ్యక్తి కత్తితో పొడిచి పెంపుడు కుక్కను చంపాడు. ఆ కుక్క యజమాని ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Meat Seller Stabs Pet Dog) ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కలన్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన భూపేంద్ర శర్మ కుటుంబం ఒక కుక్కను పెంచుతున్నది.
కాగా, జనవరి 9న సాయంత్రం వేళ మాంసం షాపు వద్దకు ఆ పెంపుడు కుక్క వెళ్లింది. మాంసం వ్యాపారి సలీం దానిని చూసి ఆగ్రహించాడు. వసీం అనే మరో వ్యక్తితో కలిసి పదునైన కత్తితో పెంపుడు కుక్కపై దాడి చేయడంతో అది మరణించింది. ఆ తర్వాత అతడు పారిపోయాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న కుక్క యజమాని భూపేంద్ర శర్మ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారైన సలీంను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read:
Dalit Woman Murdered, Daughter Kidnapped | దళిత మహిళను హత్య చేసి.. ఆమె కుమార్తెను కిడ్నాప్
ED moves Supreme Court | ఐ-ప్యాక్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ