Ganapathy | నాన్నా .. నవభారతాన్ని నిర్మించండి.. మావోయిస్టు గణపతి కొడుకు వాసుదేవరావు ఆడియో వైరల్!
Ganapathy| ‘నేటి యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం తోడైతే ఓ నవభారతాన్ని నిర్మించవచ్చు. ఇది నా నమ్మకం. ఇదే నా అభిలాష’ ఇది మావోయిస్టు అగ్రనేత గణపతిపై ఆయన కుమారుడు వాసుదేవరావుకు ఉన్న ఆకాంక్ష. గణపతి లొంగిపోవాలంటూ పరోక్షంగా వాసుదేవరావు పేరుతో విడుదలైన ఓ ఆడియో వైరల్గా మారింది.
Ganapathy | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ‘నేటి యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం తోడైతే ఓ నవభారతాన్ని నిర్మించవచ్చు. ఇది నా నమ్మకం. ఇదే నా అభిలాష’ ఇది మావోయిస్టు అగ్రనేత గణపతిపై ఆయన కుమారుడు వాసుదేవరావుకు ఉన్న ఆకాంక్ష. గణపతి లొంగిపోవాలంటూ పరోక్షంగా వాసుదేవరావు పేరుతో విడుదలైన ఓ ఆడియో వైరల్గా మారింది. గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికలపై ఆ ఆడియో చక్క ర్లు కొట్టింది.
అమెరికాలో ఉంటున్న గణప తి కుమారుడైన వాసుదేవరావు.. తన తండ్రిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు ఆ ఆడియోలో స్ప ష్టంగా ఉన్నది. దేశంలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని.. చాలా మార్పులు చోటుచేసుకున్నాయని ఆ ఆడియోలో వాసుదేవరావు చెప్పారు. తన తండ్రి నైపుణ్యం దేశానికి అత్యవసరమని, నేటి యువత ఆలోచనలకు తన తండ్రి నైపుణ్యం తోడైతే.. మన దేశం అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వాసుదేవరావు తన తండ్రి కోసం తహతహలాడుతూ రాసినట్టుగా ఉన్న ఆ ఆడియోలో ఉన్న అంశాలు ఆయన మాటల్లోనే కింది విధంగా ఉన్నాయి.
మావోయిస్ట్ అగ్రనేత #Ganapathy లొంగుబాటు వార్త మధ్య ఆయన కుమారుడు ముప్పాళ్ల వాసుదేవరావు ఆడియో వైరల్. #Maoist #opkagar pic.twitter.com/FJCR6H7I7l
— Subbu (@Subbu15465936) March 5, 2026
నాన్న అని మొదటిసారి సంబోధిస్తున్న..
‘తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ, తండ్రి కోసం ఎదురుచూసే నా లాంటి వాని భావాలు ఎలా ఉంటాయి?. నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నాన్నా అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నా. ఓ మారుమూల గ్రామంలో, ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు, మీకున్న మేధాశక్తితో 12 రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ పంథాలో సేవ చేస్తూ.. మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిజం అనేంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడుపడమంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు.’అని ఆడియోలో స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

