సత్వర న్యాయానికి నిరంతర కృషి
ప్రజలకు నాణ్యమైన, స త్వర న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్ తెలిపారు.
- నిరుడు 88.5% కేసుల పరిషారం
- హైకోర్టు సీజే అపరేశ్ కుమార్‌సింగ్
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ప్రజలకు నాణ్యమైన, స త్వర న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్ తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల సమన్వయంతో సత్వర న్యాయం సాధ్యమవుతున్నదని చెప్పా రు. నిరుడు 90,357 కేసులు దాఖలుకాగా, 80,020 కేసులు పరిషరించామని, పరిషార రేటు 88.5 శాతంగా ఉన్నదని తెలిపారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టులో జాతీయ పతాకాన్ని ఆవిషరించిన అ నంతరం జరిగిన కార్యక్రమంలో సీజే మాట్లాడారు. 2026-27లో రాష్ట్ర ప్ర భుత్వం రూ.751.45 కోట్లు కేటాయించిందని, 13 జిల్లా కోర్టు సముదాయా ల్లో పనులు కొనసాగుతున్నాయని చె ప్పారు. కేంద్ర సాయం కింద రూ.26.31 కోట్లు మంజూరుకాగా, 43 కోర్టు హాళ్లు, 37 మంది జడ్జీల నివాస క్వార్టర్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. కొత్త హైకోర్టు భవన నిర్మాణ పనులు 20.25 శాతం పూర్తయ్యాయని, హైకో ర్టు గెస్ట్ హౌస్ కూడా పూర్తికావచ్చిందన్నారు.
ఈ-కోర్టు ప్రాజెక్టులకు రూ.87.06 కోట్లు మంజూరుకాగా, రూ.63.10 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఈ-ఫైలింగ్‌తో పాటు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ-సమన్లు, ఈ-ఎఫ్ఐఆర్, ఈ-చార్జిషీట్ల దాఖలు వంటి సేవలు అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా 32,487 కేసులు పరిషరించి రూ.187.50 కోట్ల పరిహారం, రెండు జాతీయ లోక్ అదాలత్‌లలో 20.97 లక్షల కేసులు పరిషరించి రూ.856.40 కోట్ల పరిహారంగా అందించినట్టు చెప్పారు. న్యాయమూర్తుల నియామకంలో తెలంగాణవారికి ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ సురేందర్‌రెడ్డి కోరారు. పదో తరగతిలో అత్యుత్తమ మారులు సాధించిన హైకోర్టు ఉద్యోగుల పిల్లలకు సీజే పతకాలు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

