Congress | నిధులు లేని ‘ప్రగతి’ సాధ్యమేనా?.. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలపై నీలినీడలు
Congress | రాష్ట్రంలో శుక్రవారం (నేటి) నుంచి 99 రోజులపాటు సాగనున్న ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై అప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. ఆర్భాటంగా కార్యక్రమాలను ప్రకటిస్తున్న సరార్.. వాటి అమలుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.
Congress | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం (నేటి) నుంచి 99 రోజులపాటు సాగనున్న ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై అప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. ఆర్భాటంగా కార్యక్రమాలను ప్రకటిస్తున్న సరార్.. వాటి అమలుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతం అవుతుందా? కేవలం ప్రచారానికే ప రిమితమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పనుల నిర్వహణకు అవసరమైన నిధుల కేటాయింపుపై ప్రభుత్వం స్పష్ట త ఇవ్వకపోవడంతో అధికారుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. ఎలాంటి నిధులు కేటాయించకుండా ‘ప్రగతి’ పనులు ఎలా పూర్తిచేయాలనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిధులు లేకుండానే క్షేత్రస్థాయిలో పనులు చేయాలని ఆదేశాలు జారీ చేయడంపై అధికారులు మదనపడుతున్నారు. శుక్రవారం నుంచి 99 రోజులపాటు ‘ప్రజాపాలన- ప్రగ తి ప్రణాళిక’ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేసిం ది.
గ్రామాల్లోని చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో గుర్రపుడెక్క పెద్ద ఎత్తున విస్తరించింది. దాన్ని తొలగించాలని కాంట్రాక్టర్ కు పనులు అప్పగించాల్సి ఉంటుంది. ఇందు కు నిధులు అవసరం అవుతాయి. పారిశుధ్య కార్మికుల జీతాలు, వీధి దీపాల నిర్వహణ, మురుగుకాలువల శుభ్రత వంటి కనీస పనులకు కూడా నిధుల్లేక ఇప్పటికే పంచాయతీ పాలకవర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ‘పాత బకాయిలే కొండలా పేరుకుపోయి ఉంటే, ఇప్పుడు కొత్తగా 99 రోజులపాటు పనులు నిర్వహించడం ఎలా సాధ్యం?’ అని పలువురు పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు పెదవి విరుస్తున్నారు.
‘ప్రగతి ప్రణాళిక’ ఇదే
శుక్రవారం నుంచి ఈ నెల 15 వరకు పరిశుభ్రత కార్యక్రమాలు, 16 నుంచి 31 వర కు ఆదాయ పెంపుదల, ఏప్రిల్ 1 నుంచి 15 వరకు తాగునీటి వసతుల కల్పన, 16 నుంచి 30 వరకు ఇండ్లు, పరిశ్రమలు, వా ణిజ్య సంస్థల నుంచి చెత్తసేకరణ, మే 1 నుంచి 15 వరకు ఉపాధి హామీ పనులు, అదేనెల 16 నుంచి 31 వరకు వానకాలం ముప్పు నివారణ కార్యక్రమాలు చేపట్టాలని, ఆ తర్వాత మరికొన్ని కార్యక్రమాల నిర్వహణ కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీచేసింది.
ప్రగతికా? ప్రచారానికా?
గతంలో పల్లెప్రగతి ద్వారా జరిగిన అభివృద్ధి కండ్లకు కట్టినట్టు కనిపిస్తుండగా, నేటి ‘ప్రజా పాలన’ కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు హె చ్చరిస్తున్నారు. నిరుడు కూడా మున్సిపల్ శాఖ 100 రోజుల ప్రణాళిక పేరుతో కార్యక్రమాలు చేపట్టింది. ఎంత మేరకు విజయం సాధించామనే దానిపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదనే ఆరోపణలు ఉన్నాయి.
బీఆర్ఎస్ హయాంలో విజయవంతంగా పల్లె, పట్టణ ‘ప్రగతి’
గత బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. నాడు ప్రభుత్వం ప్రతినెలా పల్లె ప్రగతి కోసం 339 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ.148 కోట్లను క్రమం తప్పకుండా విడుదల చేయడం వల్ల కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు తోడుగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలు, మున్సిపాలిటీలకు నేరుగా అందజేయడంతో అభివృద్ధి పనులు వేగంగా సాగే వి. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీ లు, ట్యాంకర్ల కొనుగోలుతోపాటు వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్ల నిర్మాణానికి నిధులు అందేవి.
ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డీఎఫ్) నుంచి కూడా అత్యవసర పనుల కోసం నిధులు మంజూరు చేసేవారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం అందించే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అవార్డుల్లో తెలంగాణ గ్రామాలు వరుసగా అగ్రస్థానంలో నిలువడానికి పల్లె ప్రగతి కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయడమే ప్రధాన కారణమని నాటి ప్రభుత్వం పేర్కొన్నది. దేశంలోనే 100 శాతం బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలువడంలోనూ ఈ కార్యక్రమాలే కీలక పాత్ర పోషించాయి. కానీ, నేటి ‘ప్రజాపాలన’ ప్రణాళికలో అటువంటి ప్రత్యేక నిధుల కేటాయింపు లేకపోవడంపై పంచాయతీల పాలకవర్గాలు పెదవి విరుస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

