Trump | న్యూఢిల్లీ, మార్చి 5: ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణానంతరం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తదుపరి సుప్రీం నాయకుడి ఎంపికలో తన ప్రమేయం ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారు. వెనెజువెలా తరహాలోనే ఖమేనీ వారసుడి ఎంపిక ప్రక్రియలో తన పాత్ర ఉండాలని భావిస్తున్నట్లు ఆక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్ తదుపరి సుప్రీం నాయకుడిగా తన తండ్రి స్థానంలో ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఎంపికయ్యే అవకాశం ఉందన్న వార్తలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొజ్తాబా ఎంపిక ప్రతిపాదన తనకు ఆమోదనీయం కాదని ఆయన తెలిపారు. ఖమేనీ వారసుడి ఎంపికకు సంబంధించిన ప్రయత్నాలు సాగుతున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.