భార్యాభర్తల హత్య కలకలం.. మృతదేహాలను భూమిలో పాతి పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
గుర్తు తెలియని వ్యక్తుల భార్యాభర్తలను హత్య చేసిన సంఘటన మండల కేంద్రంలోని సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి పక్కన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మోతె మండలం బీక్య తండాకు చెందిన హలావత్ నాగులు(48), హలావత్ బూబ(45) భార్యాభర్తలు.
మోతె, ఆగస్టు 12 : గుర్తు తెలియని వ్యక్తుల భార్యాభర్తలను హత్య చేసిన సంఘటన మండల కేంద్రంలోని సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి పక్కన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మోతె మండలం బీక్య తండాకు చెందిన హలావత్ నాగులు(48), హలావత్ బూబ(45) భార్యాభర్తలు. మోతె గ్రామంలో కిరాయి ఇంట్లో ఉంటూ బొక్క సతీశ్‌రెడ్డికి సంబంధించిన వ్యవసాయ భూమిని కౌలుకు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి భార్యాభర్తలను హత్య చేసి కాళ్లు చేతులు కనిపించేలా భూమిలో పాక్షికంగా పాతిపెట్టి వదిలేసి వెళ్లిపోవడం కలకలరేపింది.
స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ లచ్చిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భూమిలో పాతపెట్టిన మృతదేహాలను వెలికి తీశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ నిందితులను త్వరలో పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

