‘పందికొక్కుల్లా దోచుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు’
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
– కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల తీరుపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫైర్
నల్లగొండ, సెప్టెంబర్ 18 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండు టర్మ్‌లు ఓడిపోయినా సరిపోయేంత డబ్బును ఈ కొద్ది నెలల్లోనే సంపాదించామని బహిరంగంగా చెప్పుకుంటున్నారన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనపై ఎలాంటి గ్రిప్ లేదని, పాలనను గాడిలో పెట్టకుండా కేసీఆర్, ఆయన కుటుంబంపై రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.
నల్లగొండకు నీళ్లు ఇవ్వకుండా అన్యాయం
ఏమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ జిల్లాకు రావాల్సిన నీటిని అందించకుండా ఎడమ కాల్వ ద్వారా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని లింగయ్య ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఆదేశాలకు నల్లగొండ జిల్లా ఇరిగేషన్ మంత్రి తల ఊపుతూ జిల్లాకు అన్యాయం చేస్తున్నారన్నారు. మరోవైపు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రాకు నీటిని తరలిస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. మరో 10–15 రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
దళితులపై వేధింపులు.. పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం
కాంగ్రెస్ పాలనలో దళితులపై వేధింపులు పెరిగాయన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకల వద్ద కూడా రాజకీయాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పలగూడెంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, వార్డు మెంబర్లు సొంత డబ్బులతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి షెడ్డు నిర్మిస్తే, ఎమ్మెల్యే అనుచరులు దాన్ని తొలగించినట్లు చెప్పారు. దీనిని ప్రశ్నించిన దళితులు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసి, తలుపులు బద్దలుగొట్టి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యేల మెప్పు కోసం కాకుండా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని చిరుమర్తి లింగయ్య హితవు పలికారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

