Warren Buffett : అపర కుబేరుడు వారెన్ బఫెట్ (Warren Buffett ) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే పెట్టుబడుల కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే సీఈవో పోస్ట్‌ను వదులుకున్న ఆయన ఈసారి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అర్ధ శతాబ్దం పైగా చైర్మన్‌గా సేవలందించిన ఆయన.. శుక్రవారం బాధ్యతల నుంచి వైదొలిగారు. అందరూ వ్యాపారవేత్తల మాదిరిగానే ఆయన కూడా తన వారసుడు హొవార్డ్ బఫెట్‌ను తదుపరి చైర్మన్ చేయనున్నారు.
పెట్టుబడుల దిగ్గజం వారెన్ బఫెట్ ఏడాదిలో మరో పదవికి రాజీనామా చేశారు. బెర్ష్షైర్ హాత్వేను సంపన్న కంపెనీగా తీర్చిదిద్దిన బఫెట్ ఈ ఏడాది ఆరంభంలోనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవిని వదులకున్నారు. ఈసారి ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. 56 ఏళ్ల పాటు ఈ హోదాలో కొనసాగిన ఆయన తన వారసుడికి పగ్గాలు అప్పగించనున్నారు.
Warren Buffett, 96, has stepped down as chairman of Berkshire Hathaway. His son, Howard Buffett, is taking over.
>Be Warren Buffett
>Buy your first stock at 11
>Get rejected by Harvard Business School
>Keep learning anyway
>Buy a house for $31,500 in 1958.>Take over Berkshire… pic.twitter.com/iLEQFHNn0m
— WOLF (@WOLF_Financial) September 18, 2026
కంపెనీ వాటాదారులకు రాసిన రాజీనామా లేఖలో భావోద్వేగానికి లోనైన బఫెట్.. ప్రస్తుతం సంస్థ సరైన వ్యక్తి చేతుల్లోనే ఉందని అన్నారు. ‘1965 నుంచి బెర్క్‌షైర్‌లో పనిచేస్తున్నా. అరవై ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రపంచంలోని అత్యుత్తమ జాబ్ నాకుంది. నా వయసు వాళ్లలో చాలామంది ఇలా చెప్పకపోవచ్చు. జరుగబోయే దాని గురించి నేను ఎప్పడూ సంతృప్తి చెందలేదు. కంపెనీని గ్రెగ్ చూసుకుంటాడు. ఈ సంస్థ విలువలు, సంస్కృతిని హొవార్డు కాపాడుతాడు. వీరిద్దరూ ఎంతో ముఖ్యమైనవారు’ అని బఫెట్ పేర్కొన్నారు.
Breaking: Warren Buffett is stepping down as chairman of Berkshire Hathaway https://t.co/DI2hk3oMpX
— The Wall Street Journal (@WSJ) September 18, 2026
రిటైర్ అయినప్పటికీ ఈ కుబేరుడు.. చైర్మన్ ఎమిరిటస్‌గా వ్యవహరించనున్నారు. అనంతరం కుమారుడు హొవార్డ్ బఫెట్‌ని తదుపరి చైర్మన్ చేయనున్నారు బఫెట్.1993 నుంచి బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్న హొవార్డ్.. ఒరాకిల్ ఆఫ్ ఒమహలోనూ సేవలందిస్తున్నారు. బఫెట్ సీఈవోగా రాజీనామా చేసిన అనంతరం ట్రిలియన్ అమెరికా డాలర్ల మార్కెట్ విలువున్న కంపెనీని గ్రెగ్ అబెల్ చూసుకుంటున్నారు.