రాయ్‌పూర్: పశ్నాప్రతంలో కుక్క పేరుకు సంబంధించిన బహుళైచ్ఛికాల్లో ‘రామ్’ ఉన్నది. హిందూ సంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రభుత్వ స్కూల్ టీచర్లను సస్పెండ్ చేశారు. (Chhattisgarh Exam Paper) బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. జనవరి 6న రాయ్‌పూర్ డివిజన్లోని పలు జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగో తరగతి అర్ధ సంవత్సర ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. ప్రశ్నాపత్రంలో ‘మోనా కుక్క పేరు ఏమిటి?’ అని ప్రశ్న అడిగారు. దానికి నాలుగు ఐచ్ఛికాలుగా బాల, షేరు, రామ్, పైవేవీ కావు అని పేర్కొన్నారు.
కాగా, బలోదబజార్, భటపార, మహాసముంద్, ధమ్తారి, గరియాబంద్ జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్స్‌కు కూడా ఇదే ప్రశ్నాపత్రం పంపిణీ అయ్యింది. దీంతో కుక్క పేరు ప్రశ్నకు ఐచ్ఛికంగా ‘రామ్’ అని ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు హిందూ సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
మరోవైపు రాయ్‌పూర్ జిల్లా విద్యాశాఖ అధికారి దీనిపై స్పందించారు. ఐదుగురు సభ్యుల కమిటీతో దర్యాప్తు చేయించారు. నక్తి (ఖాప్రి)లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిఖా సోని ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేసినట్లు తెలుసుకున్నారు. రాయ్‌పూర్ ఫఫాదిహ్లోని హయ్యర్ సెకండరీ స్కూల్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ టీచర్ నమ్రతా వర్మ మోడరేటర్‌గా పనిచేసినట్లు గుర్తించారు.
అయితే ఆ ఇద్దరు టీచర్లు జరిగిన తప్పుపై లిఖితపూర్వక వివరణ ఇవ్వడంతోపాటు క్షమాపణలు తెలిపారు. ‘రాము బదులు రామ్’ అని పొరపాటుగా ప్రింట్ అయ్యిందని పేర్కొన్నారు. అయినప్పటికీ వారిపై చర్యలు చేపట్టారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శిఖా సోనీని సస్పెండ్ చేశారు. మోడరేటర్ అయిన కాంట్రాక్ట్ టీచర్‌ను కూడా సస్పెండ్ చేయడంతోపాటు తొలగించే చర్యలు చేపట్టారు.
Also Read:
Bangladesh Balloon | బంగ్లాదేశ్ నుంచి బెలూన్.. అస్సాంలో ల్యాండ్
Massive Fire Breaks In Himachal | హిమాచల్ ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాలుడు సజీవ దహనం
Watch: అన్న ఇంటికి నిప్పంటించేందుకు తమ్ముడు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?