Sancharame Song | టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకల సందడి సోషల్ మీడియాలో ఇంకా తగ్గడం లేదు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట వీరి పెళ్లికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకునే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆనంద్ తన తాజా చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ లోని మెలోడీ సాంగ్ ‘సంచారమే’ కు విజయ్, రష్మికలతో కలిసి స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. ఉదయ్‌పూర్‌లోని రిసార్ట్ పచ్చని లాన్లో ఈ జంట తమ స్నేహితులతో కలిసి అత్యంత సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. విజయ్ కలర్‌ఫుల్ షర్ట్‌లో, రష్మిక ఎంతో క్యాజువల్‌గా కనిపించి సందడి చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. తమకు ఇష్టమైన వారితో కలిసి ఇలా గడపడం చాలా సంతోషంగా ఉందని ఆనంద్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.