Coconut Water | వేసవికాలంలో రోజూ కొబ్బరినీళ్లను తాగాల్సిందే.. ఎందుకంటే..
వేసవికాలం అనగానే మండే ఎండ, అధిక చెమట, అలసట, నీరసం వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. వేసవికాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. చెమట ద్వారా శరీరం ద్రవాలను ఎక్కువగా కోల్పోతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. శరీరం హైడ్రెటెడ్ గా ఉండడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Coconut Water | వేసవికాలం అనగానే మండే ఎండ, అధిక చెమట, అలసట, నీరసం వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. వేసవికాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. చెమట ద్వారా శరీరం ద్రవాలను ఎక్కువగా కోల్పోతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. శరీరం హైడ్రెటెడ్ గా ఉండడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. కనుక వేసవిలో ద్రవాలతో పాటు ద్రవాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా బయట ఎక్కువగా పనిచేసే వారు ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే చక్కెరలు ఎక్కువగా ఉండే శీతల పానీయాల కంటే కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
డీహైడ్రేషన్ రాకుండా..
కొబ్బరినీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గడంతో పాటు శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి. ఇది సహజమైనది, ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వేసవికాలంలో కొబ్బరి నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నీరు శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగిన తరువాత కొబ్బరి నీటిని తీసుకోవడం మంచిది. చెమట కారణంగా శరీరం ముఖ్యమైన ఖనిజాలను కోల్పోతుంది. కొబ్బరి నీటిని తాగడం వల్ల పొటాషియం, సోడియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎలక్ట్రోలైట్స్ తిరిగి శరీరానికి అందుతాయి. శరీరంలో ద్రవసమతుల్యం పునరుద్దరించడంతో పాటు కండరాల నొప్పులు తగ్గుతాయి. కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. అలసట, చర్మంపై రాషెస్, తలనొప్పి వంటి ఎండ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
కిడ్నీ స్టోన్లకు పరిష్కారం..
వేసవిలో జీర్ణక్రియ సమస్యలు తలెత్తడం సహజం. కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల దీనిలో ఉండే బయోఆక్టివ్ ఎంజైమ్స్, సహజ ఆల్కలైన్ గుణాలు జీర్ణాశయానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. దీంతో ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. వేసవికాలంలో శక్తిని త్వరగా కోల్పోతూ ఉంటారు. అటువంటి సమయంలో కొబ్బరి నీటిని తాగడం వల్ల దీనిలో ఉండే సహజ చక్కెరలు, మెగ్నీషియం శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. కొబ్బరి నీరు సహజంగానే డయురెటిక్ గా పని చేస్తుంది. ఇది మూత్రవిసర్జనను పెంచి శరీరంలో విషాలను, వ్యర్థపదార్థాలను బయటకు పంపుతుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్ల వంటి సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కొబ్బరి నీటిలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరం మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
గుండె ఆరోగ్యానికి..
కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కనుక ఈ నీటిని తాగడం వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీరు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిని కూడా మితంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులు, క్రానిక్ కిడ్నీ డిసీజ్, అధిక రక్తపోటు, పొటాషియం ఉన్న ఆహారాలను మితంగా తీసుకునే వారు కొబ్బరి నీటిని వైద్యుల సూచన మేరకు తీసుకోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- coconut water
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

