Virosh | ఆనంద్ దేవరకొండ పాటకి విజయ్-రష్మిక క్యూట్ స్టెప్స్ .. డ్యాన్స్ వీడియో వైరల్
Virosh | టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని రాజసికమైన ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై కొత్త దంపతులకు ఆశీస్సులు అందించారు.
Virosh | టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని రాజసికమైన ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై కొత్త దంపతులకు ఆశీస్సులు అందించారు. పెళ్లి అనంతరం విజయ్ సొంత ఊరిలో సత్యనారాయణ వ్రతం నిర్వహించడం, అభిమానులకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయడం, అలాగే సినీ–రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో ఈ జంట బిజీగా గడిపింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి.
పెళ్లి కార్యక్రమాలు ముగియడంతో ప్రస్తుతం విజయ్–రష్మిక కొంత రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో విజయ్ సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక సరదా వీడియోను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నతో కలిసి ఆనంద్ దేవరకొండ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ముగ్గురూ కలిసి సరదాగా స్టెప్పులు వేస్తూ కనిపించడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇటీవల ‘సంచారమే’ అనే పాటను విడుదల చేశారు. విడుదలైన వెంటనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ముఖ్యంగా ఈ పాటకు సంబంధించిన రీల్స్ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ ట్రెండీ సాంగ్‌ను విజయ్, రష్మిక, ఆనంద్ ముగ్గురు కలిసి రీక్రియేట్ చేస్తూ సరదాగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఆనంద్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియోకు క్యాప్షన్‌గా ఆనంద్ దేవరకొండ .. ఇది కొంచెం గందరగోళంగా కనిపించవచ్చు. కానీ ఆ క్షణంలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డ్యాన్స్ చేస్తే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది అని తన భావాలను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు విజయ్–రష్మిక జంటపై ప్రేమతో కామెంట్లు చేస్తున్నారు. మీరు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి , క్యూట్ కపుల్, ఫ్యామిలీ గోల్స్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

