సిమ్లా: భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘనటలో ఆరేళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలతో సహా పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. (Massive Fire Breaks In Himachal) పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఆర్కి పాత బస్ స్టాండ్ ప్రాంతంలోని నివాస భవనాల్లో మంటలు చెలరేగాయి. ఆరేడు ఎల్పీజీ సిలిండర్లు పేలడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. సమీపంలోని భవనాలకు మంటలు వేగంగా వ్యాపించాయి.
కాగా, అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు అక్కడకు చేరుకున్నాయి. మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టాయి. వలస కూలీ కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలుడు సజీవ దహనమైనట్లు గుర్తించారు. ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలతో సహా పలువురు కనిపించకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
हिमाचल के सोलन में भीषण आग से एक बच्चे की मौत हुई है, कई लोग घायल है। pic.twitter.com/9OLYAYRkd9
— Chandan Singh Rajput (@imchandansinghs) January 12, 2026
#WATCH | Himachal Pradesh: A major fire broke out near the UCO Bank building at the old bus stand in Arki town of Solan district late last night. pic.twitter.com/LuPvFS0BQH
— ANI (@ANI) January 12, 2026
Bangladesh Balloon | బంగ్లాదేశ్ నుంచి బెలూన్.. అస్సాంలో ల్యాండ్
Girl Gang Raped | బాలికపై సామూహిక అత్యాచారం.. 8 మంది యువకులు అరెస్ట్
Watch: అన్న ఇంటికి నిప్పంటించేందుకు తమ్ముడు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?