హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయుష్ మిష న్ కింద కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తు న్న సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా 33 జిల్లాలకుగాను ఎస్పీఎంయూ(స్టేట్ ప్రోగ్రామ్స్ మేనేజ్మెంట్ యూనిట్), డీపీఎంయూ(డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూ నిట్)లను నియమించగా.. 6 జిల్లా ల్లో ఇన్చార్జి డీపీఎంయూలు ఉన్నా రు. వీరంతా అధికారుల ఆదేశాల మే రకు హెల్త్ క్యాంపులు, ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నా.. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. నేషనల్ ఆయుష్ మిషన్ బ్యాంక్ ఖాతాలో నిధులు ఉన్నా ఉన్నతాధికారులు స్పందించ డంలేదని సిబ్బంది వాపోతున్నారు. అధికారులు మాత్రం టెక్నికల్ సమ స్య కారణంగా జీతాలు రావడం లేదని చెప్తున్నారు.