Keralam | కేరళ ఇకపై కేరళం.. పేరు మార్పు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Keralam | కేరళ రాష్ట్రం (Kerala State) పేరును 'కేరళం (Keralam)' గా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. మంగళవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఫలితంగా రాష్ట్రం పేరు మార్పు ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది.
Keralam : కేరళ రాష్ట్రం (Kerala State) పేరును ‘కేరళం (Keralam)’ గా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. మంగళవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఫలితంగా రాష్ట్రం పేరు మార్పు ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో లేకపోవడంతో ఆయన తరఫున హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ‘కేరళ (పేరు మార్పు) బిల్లు-2026’ ను ప్రవేశపెట్టారు. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలతోపాటు ఇతర కీలక అంశాలపై అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ గందరగోళ పరిస్థితుల నడుమనే బిల్లుకు సభ ఆమోద ముద్రవేసింది.
మలయాళంలో తమ రాష్ట్రాన్ని ‘కేరళం’ అని పిలుస్తారని, అధికారికంగా కూడా అదే పేరును ఖరారు చేయాలని కేరళ శాసనసభ 2024 జూన్‌లో తీర్మానం చేసింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్రపతి ఈ ముసాయిదా బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపారు. 2026 జూలైలో అసెంబ్లీ దీనికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ బిల్లు ఆమోదంతో రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో సవరణలు జరగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

