సినీప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా ముందు వరుసలో ఉంటుంది. హరీష్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19నే విడుదల కానుంది. దీంతో ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్ అద్భుతమైన కమాండింగ్ అవతారంలో కనిపించారు. విడుదలైన క్షణం నుంచే సామాజిక మాధ్యమాల్లో ఈ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవన్ స్క్రీన్ ప్రెజన్స్, ఆయన మార్క్ డైలాగులు, బాడీలాంగ్వేజ్ అభిమానుల్లోనే కాక, సగటు ప్రేక్షకుడికి కూడా చర్చనీయాంశాలుగా నిలిచాయి. ఈ సినిమా కథలోని తీవ్రతను ఈ గ్లింప్స్ ఆవిష్కరించింది. త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో పార్దీబన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కథనం: కె.దశరథ్, రమేష్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నేపథ్యసంగీతం: ఎస్.తమన్, కూర్పు: కార్తిక్ శ్రీనివాస్.