Health Tips | అబ్బే.. థూ.. అంటూ చీకొట్టకండి.. రోజూ పళ్లు తోమకముందే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందట..!
Health Tips | దాదాపుగా అందరూ ఉదయం లేవగానే వాష్రూమ్ కు వెళ్లి, బ్రష్ చేసుకున్న తర్వాతనే ఏదైనా తాగడం గానీ, తినడంగానీ చేస్తారు. అప్పటి వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. నోరును శుద్ధి చేసుకోకుండా ఏదైనా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని భయపడుతుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు (Health experts) మాత్రం బ్రష్ చేయకముందే మంచినీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.
Health Tips : దాదాపుగా అందరూ ఉదయం లేవగానే వాష్రూమ్ కు వెళ్లి, బ్రష్ చేసుకున్న తర్వాతనే ఏదైనా తాగడం గానీ, తినడంగానీ చేస్తారు. అప్పటి వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. నోరును శుద్ధి చేసుకోకుండా ఏదైనా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని భయపడుతుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు (Health experts) మాత్రం బ్రష్ చేయకముందే మంచినీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. రోజూ పళ్లు తోమకుండానే ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఆ లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
లాభాలు..?
ఉదయం లేవగానే బ్రష్ కూడా చేయకుండా నీళ్లు తాగడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం బరువు తగ్గడం. కాబట్టి ఊబకాయం ఉన్న వాళ్లు రోజూ లేవగానే పళ్లు తోమకముందే ఒక గ్లాస్ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
పళ్లు తోమకముందే నీళ్లు తాగడంవల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది శరీరంలోని కేలరీలను బర్న్ చేయడంలో సాయపడుతుంది. అందుకే ఒంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.
బ్రష్ చేయకముందే నీళ్లు తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. పళ్లు తోమగానే ఏదో ఒకటి తీసుకోవాలనేంత ఆకలి ఉండదు. దాంతో తక్కువగా తింటారు. ఇది కూడా ఊబకాయం బారినపడకుండా చూస్తుంది.
ఈ రోజుల్లో చాలామంది హై బీపీ, మధుమేహం లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడంవల్ల సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయి.
అంతేగాక బ్రష్ చేయకముందే నీళ్లు తాగడంవల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. దాంతో ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. ఉదర సంబంధ ఇబ్బందులు కూడా సమసిపోతాయి.
రోజూ పళ్లు తోమకముందే నీళ్లు తాగడంవల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. మాటిమాటికి జలుబు, దగ్గు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చినా త్వరగా తగ్గిపోతాయి.
పళ్లు తోమకుండా నీళ్లు తాగడంవల్ల నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో ఆరోగ్యం మెరుపడి అలసట తొలగిపోతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | అబ్బే.. థూ.. అంటూ చీకొట్టకండి.. రోజూ పళ్లు తోమకముందే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందట..!
Padi Kaushik Reddy | ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్
Fake OSD | మంత్రి శ్రీధర్ బాబు ఒఎస్డీనంటూ రూ.50 లక్షలు కాజేసిన దుండగుడు
PM Modi | ‘నేను సవాళ్లనే సవాల్ చేసే మనిషిని’.. ఐఐటీ ఖరగ్పూర్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘దివికి దివికి’ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

