AP News | పరిషత్ ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 6 శాతానికిపైగా ఓట్లు కోల్పోయింది : చంద్రబాబు
AP News | స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికల్లో కూడా ప్రజలు అద్భుత ఫలితాలు ఇచ్చారని పేర్కొన్నారు.
AP News : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికల్లో కూడా ప్రజలు అద్భుత ఫలితాలు ఇచ్చారని పేర్కొన్నారు. తమ రెండున్నరేళ్ల పరిపాలన భేష్ అంటూ ప్రజలిచ్చిన తీర్పుగా ఈ విజయాన్ని భావిస్తున్నామని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ హెడ్ ఆఫీస్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
ఈవీఎంలు, బ్యాలెట్లు, పోస్టల్ బ్యాలెట్లు.. ఎన్నిక ఏ రీతిన జరిగినా విజయం కూటమి పార్టీలదేనని చంద్రబాబు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన తమకు, పరిషత్ ఎన్నికల్లో అంతకుమించిన ఫలితం వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో తాము 96.4 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో 3.6 శాతం ఓట్లు పెరిగాయన్నారు.
గొడ్డలి పార్టీకి గతంలో 39.8 శాతం ఓట్లు పాలయ్యాయని, ఇప్పుడు అందులో నుంచి 6 శాతానికిపైగా ఓట్లను ఆ పార్టీ కోల్పోయిందని బాబు అన్నారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చాలా శ్రద్ధ పెట్టామని చెప్పారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశామని అన్నారు. ఈ ఎన్నికల కోసం తాము ప్రత్యేకంగా వార్‌రూమ్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- ap cm
- AP News
- Axe Party
- chandrababu
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పరిషత్ ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 6 శాతానికిపైగా ఓట్లు కోల్పోయింది : చంద్రబాబు
Health Tips | అబ్బే.. థూ.. అంటూ చీకొట్టకండి.. రోజూ పళ్లు తోమకముందే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందట..!
Padi Kaushik Reddy | ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్
Fake OSD | మంత్రి శ్రీధర్ బాబు ఒఎస్డీనంటూ రూ.50 లక్షలు కాజేసిన దుండగుడు
PM Modi | ‘నేను సవాళ్లనే సవాల్ చేసే మనిషిని’.. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

