విద్యుత్ సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన
తరచుగా విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో స్థల దాత సహాయంతో అధికారులు విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించారు.
కారేపల్లి, జూలై 28 : తరచుగా విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో స్థల దాత సహాయంతో అధికారులు విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించారు. ఆనాడు స్థల దాతకు అధికారులు ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయకపోవడంతో ఆగ్రహించిన ఆమె తరచుగా సబ్ స్టేషన్ లోకి చొరబడి విద్యుత్ ప్రసారాన్ని నిలిపివేస్తుంది. దీంతో కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్న సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాల ప్రజలు స్థానిక సర్పంచులతో కలిసి ఇల్లెందు- కారేపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు.
సుమారు రెండు గంటల పాటు జరిగిన ఆందోళనతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, సీఐ నూనావత్ సాగర్, ఎస్ఐ బైరు గోపి విద్యుత్ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి విరమింపజేశారు. అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ నుండి కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. ఇప్పటికైనా తన సమస్యకు పరిష్కారం చూపించకపోతే మళ్లీ కరెంట్ సరఫరాను నిలిపివేస్తానని స్థల దాత హెచ్చరించడం కొసమెరుపు.

విద్యుత్ సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

