అమరావతి : వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ) ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా చంద్రబాబు( Chandrababu ) , నారా లోకేష్ ( Lokesh ) డబ్బు పిచ్చిపట్టిందని విమర్శించారు. ఆదివారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ వైసీపీ( YCP ) విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు తన ధన బలంతో ఓటర్లను ప్రలోభ పెడతారని , కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్లను డబ్బుతో కాదు ప్రేమతో కొనాలని సూచించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని, గ్రామాల్లో వైసీపీ జండా రెపరెపలాడాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కోతలు, ఎరువులు అందడం లేదని ఆరోపించారు.
రైతు కన్నీరు పెడితే ప్రభుత్వాలు కూలిపోతాయని వెల్లడించారు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్ జగన్ను వదులుకున్నామని జనం బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దౌర్భా్గ్య పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.