West Indies Squad : వెస్టిండీస్ విధ్వసంక ఆటగాడు షిమ్రన్ హిట్మైర్ (Shimron Hetmyer) భారత జట్టుతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆదివారం సెలెక్టర్లు వన్డే, టీ20లకు స్క్వాడ్‌ను ప్రకటించగా.. పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే హిట్మైర్ ఎంపికయ్యాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో దంచేసిన ఓపెనర్ కమిల్ పూరన్ (Kamil Pooran) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(CPL)లో మెరిసిన ఈ కుర్రాడికి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అవకాశం దక్కింది. సీనియర్ పేసర్ అల్జారీ జోసెఫ్‌ను సెలెక్టర్లు వన్డేలకు మాత్రమే తీసుకున్నారు.
భారత పర్యటన కోసం ఆదివారం వెస్టిండీస్ సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. వన్డే, టీ20 ఫార్మాట్లకు షాయ్ హోప్ సారథిగా పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు. హిట్మైర్ వన్డేలకు దూరమవ్వగా.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఉతికేసిన కమిల్ పూరన్ తొలిసారి టీ20 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ మధ్యే ముగిసిన టోర్నీలో సెయింట్ లూయిస్ కింగ్స్ తరఫున 159.34 స్ట్రయిక్ రేటుతో 273 పరుగులు సాధించాడీ యువకెరటం.
🚨 West Indies have announced their ODI and T20I squads for the upcoming tour of India pic.twitter.com/ZBkl7K2G7U
— Cricbuzz (@cricbuzz) September 20, 2026
జేసన్ హోల్డర్ లేకున్నా సీనియర్ అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జైడన్ సీల్స్‌లో విండీస్ పేస్ దళం దుర్భేద్యంగా ఉంది. స్పిన్ యూనిట్లో ఛేజ్, ఫొర్డే కీలకం కానున్నారు. ఇక.. టీ20 స్క్వాడ్‌లోకి ఓపెనర్ క్యాంప్‌బెల్ మళ్లీ వచ్చాడు. స్క్వాడ్ ప్రకటన అనంతరం హెడ్‌కోచ్ డారెన్ సమీ మాట్లాడుతూ.. అత్యుత్తమ జట్టైన భారత్‌తో ఆడుతున్నప్పుడు తమ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకుంటారని అన్నాడు.
‘ప్రపంచంలోని మేటి జట్టుతో ఆడుతున్నప్పుడు వన్డేల్లో మా ప్రదర్శనను మెరుగుపరచుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా ఆటగాళ్ల ప్రదర్శనను గమనించడం, ఎవరెవరు ఏ బాధ్యతల్లో సరిపోతారనేది నిర్ణయించడానికి వీలవుతుంది’ అని సమీ పేర్కొన్నాడు. అక్టోబర్ 27న తిరువనంతపురంలో తొలి మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్ మొదలవ్వనుంది. ఆపై అక్టోబర్ 6 నుంచి మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియాను విండీస్ ఢీ కొట్టనుంది. ఈ రెండు ఫార్మాట్ల సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ స్క్వాడ్‌ను వెల్లడించిన విషయం తెలిసిందే.
Pooran Power at Providence! 💪
Kamil Pooran continues his good form in the middle!🇬🇾 x 🇱🇨#CPL26 #GAWvSLK #CricketPlayedLouder #BiggestPartyInSport #BYD pic.twitter.com/IZ960RP04y
— CPL T20 (@CPL) September 9, 2026
వెస్టిండీస్ వన్డే స్క్వాడ్ : షాయ్ హోప్(కెప్టెన్), జెవెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్‌బెల్, కేసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫొర్డే, జస్టిన్ గ్రేవ్స్, అమిర్ జన్గూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెష్, విటెల్ లవెస్, మోతీ, కీమో పాల్, షెర్ఫానే రూథర్‌ఫొర్డ్, జైడన్ సీల్స్.
వెస్టిండీస్ టీ20 స్క్వాడ్ : షాయ్ హోప్(కెప్టెన్), జెవెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫొర్డే, షిమ్రన్ హిట్మైర్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, మోతీ, కీమో పాల్, కమిల్ పూరన్, రొవ్మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫొర్డ్, క్వెంటిన్ సాంప్సన్, రొమారియో షెపర్డ్, షమర్ స్ప్రింగర్.
🚨 News 🚨#TeamIndia ODI & T20I squads announced for West Indies tour of India 2026, along with updated squad for Japan T20I & Asian Games.
More Details ▶️https://t.co/Lxx3Bz8Q14 pic.twitter.com/Y9RGlQ09XK
— BCCI (@BCCI) September 16, 2026