Snake in Train : ఓ రైలు కంపార్ట్మెంట్ (Rail Compartment) లో పాము ప్రత్యక్షం కావడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా (Social Media) లో పంచుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party).. కేంద్ర ప్రభుత్వంపై, రైల్వే శాఖ మంత్రి (Rail Minister) పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇది రైలు ప్రయాణం కాదని, రైల్వే శాఖ అందిస్తున్న ‘జంగిల్ సఫారీ (Jungle Saffari)’ అని ఎద్దేవా చేసింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రైలు బోగీలోని ఓ బెర్త్ కింద పాము కదులుతూ కనిపించింది. ఈ వీడియోకు ఘాటైన వ్యాఖ్యను జోడించింది. ఇకపై భారతీయ రైల్వేలో ‘జంగిల్ సఫారీ’ థ్రిల్‌ను కూడా పొందండి అంటూ ఎద్దేవా చేసింది. ఇదిగో రైల్లో మీతో ప్రయాణిస్తున్న ఈ సర్పరాజు మీకు ఆ థ్రిల్‌ను అందిస్తాడు అని వ్యాఖ్యానించింది. ప్రయాణికుల భద్రతకు వాళ్లే బాధ్యులని, బలవంతంగా ఛార్జీలు పిండుకునే ‘రీల్ మినిస్టర్’కు మీ ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేదని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే నిదర్శనమని పలువురు నెటిజన్లు, విపక్ష నేతలు కామెంట్లు చేస్తున్నారు.
अब तो ट्रेन में भी डर लग रहा है कि कब कौन सा जीव आ जाए
चलती गाड़ी में नाग देवता कोच के अंदर देखे गए वो तो भला हो एक आदमी का जिसकी नजर पड़ गई
पहले तो चूहे का आतंक रहता था अब तो सांप भी आने लगे pic.twitter.com/wfLEkLc66s
— Rahul Patel (@rahul225234) September 20, 2026