భోపాల్: నీటి పైపులు పగిలాయి. నీరు ఎగజిమ్మడంతో అక్కడి నేల బీటలు వారింది. ఆ కాలనీ మొత్తం నీట మునిగింది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. తమ ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడ్డారు. (Pipeline Burst) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. జనవరి 10న రాత్రి వేళ అర్బన్ గ్రీన్ సిటీ ప్రాంతంలోని నీటి పైపులైన్ పగిలింది. దీంతో ఒక ఇంటి ముందున్న నేల అకస్మాత్తుగా బీటలు వారింది. పైకి ఉబికివచ్చిన నీరు ఆ ప్రాంతమంతా విస్తరించింది. ఆ కాలనీ నీట మునిగింది.
కాగా, బలమైన నీటి పీడనం కారణంగా సమీపంలోని పలు ఇళ్లు పగుళ్లిచ్చాయి. కొన్ని ఇళ్లలోని గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. అనేక ఇళ్ళు పాక్షికంగా మునిగిపోయాయి. ఏం జరుగుతున్నదో తెలియక నివాసితులు ఆందోళన చెందారు. భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. ఇళ్లు కూలుతాయేమోనని భయాందోళన చెందారు. చాలా సేపు వరకు ఇళ్లలోకి తిరిగి వెళ్లలేదు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న గ్వాలియర్ మున్సిపల్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పగిలిన నీటి సరఫరా లైన్ మూసివేయాలని అధికారులను ఆదేశించారు. అయితే నాణ్యత లేని నీటి పైపులైన్లపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | #Gwalior: Pipeline Burst Cracks Open Ground, Floods Entire Colony In Urban Green City Area #MadhyaPradesh #MPNews pic.twitter.com/fayU8NnIj5
— Free Press Madhya Pradesh (@FreePressMP) January 11, 2026
Also Read:
Jagdeep Dhankhar | రెండుసార్లు స్పృహ కోల్పోయిన జగదీప్ ధన్ఖర్.. ఢిల్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్
Girl Gang-Raped In Car | 12వ తరగతి విద్యార్థిని కిడ్నాప్.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం
Chhattisgarh Exam Paper | కుక్క పేరు ప్రశ్నకు ‘రామ్’ ఐచ్ఛికం.. ఇద్దరు టీచర్లు సస్పెండ్
Massive Fire Breaks In Himachal | హిమాచల్ ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాలుడు సజీవ దహనం