రాయపోల్, మార్చి 09 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని చిన్న మాసంపల్లి గ్రామానికి చెందిన వంక సందీప్ బైక్పై వస్తూ ముఖ్యమైన పత్రాలు పోగొట్టుకున్నాడు. సిద్దిపేట నుండి తన స్వగ్రామానికి బైక్ మీద వస్తుండగా బండి ట్యాంక్ కవర్లోంచి బైక్ ఆర్సీ కార్డు మార్గమధ్యంలో కిందపడిపోయినట్లు సందీప్ తెలిపాడు.
ఆర్సీ కార్డుతో పాటు ఆధార్ కార్డు, గాయత్రి బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం కార్డు కూడా పడిపోయాయని సందీప్ వెల్లడించాడు. దారి వెంట ఎవరికైనా తన ఆర్సీ కార్డు, ఆధార్ కార్డు, గాయత్రి బ్యాంక్ పాస్బుక్ లేదా ఏటీఎం కార్డు దొరికితే వెంటనే తెలియజేయాలని సందీప్ విజ్ఞప్తి చేశాడు. ఈ వస్తువులు దొరికిన వారు తనను 6302832366, 7286879743 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అతడు కోరాడు.