రాయపోల్, మార్చి 09: విద్యార్ధులు ఉన్నతమైన లక్షణాలు ఏర్పరచుకొని భవిష్యత్తులో మంచి అధికారులుగా ఎదిగినప్పుడే గురువులకు ఎనలేని ఆనందం కలుగుతుందని బేగంపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ అన్నారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.
స్వయం పరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన ఉపాధ్యాయులు ప్రమీల మేడం, ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కోరారు. సర్పంచ్ గీత ప్రవీణ్ మాట్లాడుతూ.. ఉన్నతమైన విజయాలు అందుకోవాలంటే కష్టపడి చదవడం నేర్చుకోవాలని అన్నారు. ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండి చదువుకున్నప్పుడే జీవితంలో అధికారులుగా ఉండే అవకాశాలు మీకు అందుతాయని ఆమె విద్యార్ధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ, ఉపాధ్యాయులు కిరణ్, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొ్న్నారు.