న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ (Jagdeep Dhankhar) వారాంతంలో రెండుసార్లు స్పృహ కోల్పోయారు. దీంతో సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆయనను అడ్మిట్ చేశారు. జగదీప్ ధన్ఖర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 74 ఏళ్ల జగదీప్ ధన్‌ఖర్‌కు జనవరి 10న ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అదే రోజున బాత్రూమ్లో రెండుసార్లు ఆయన స్పృహ కోల్పోగా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.
కాగా, సోమవారం మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు జగదీప్ ధన్‌ఖర్‌ను తీసుకెళ్లారు. దీంతో వైద్య పరీక్షల కోసం ఆయనను అడ్మిట్ చేయాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. వైద్య పరీక్షల్లో భాగంగా ఎంఆర్ఐ నిర్వహించే అవకాశం ఉన్నదని ఒక అధికారి తెలిపారు.
మరోవైపు గతంలో బహిరంగ కార్యక్రమాలకు హాజరైనప్పుడు కూడా జగదీప్ ధన్ఖర్ పలు సందర్భాల్లో స్పృహ కోల్పోయారు. గత ఏడాది జూలై 21న ఆరోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు. జగదీప్ ధన్ఖర్ ఆకస్మిక రాజీనామా అనేక ఊహాగానాలకు దారితీసింది.
Also Read:
Girl Gang-Raped In Car | 12వ తరగతి విద్యార్థిని కిడ్నాప్.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం
Bangladeshi Flag | ఇంటర్నేషనల్ స్కూల్లో బంగ్లాదేశ్ జెండా.. బజరంగ్ దళ్ హెచ్చరిక
Bangladesh Balloon | బంగ్లాదేశ్ నుంచి బెలూన్.. అస్సాంలో ల్యాండ్
Chhattisgarh Exam Paper | కుక్క పేరు ప్రశ్నకు ‘రామ్’ ఐచ్ఛికం.. ఇద్దరు టీచర్లు సస్పెండ్