Moniabad Drugs Case : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసు(Moniabad Drugs Case)లో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను జడ్జి ముందు హాజరుపరిచారు.
మొయినాబాద్‌లో డ్రగ్స్ కేసులో ఇరురాష్ట్రాల రాజకీయ నాయకులు ఉండడం సంచలనంగా మారింది. ఈగిల్ బృందం జరిపిన పరీక్షల్లో తాండూరు మాజీ ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, రితేశ్ రెడ్డి, నమిత్, కౌశిక్, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చిందని ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు ఉప్పర్‌పల్లిలో జడ్జి ముందు హాజరుపరిచారు.