వేణుకుమార్ కుటుంబానికి ‘నామా ట్రస్ట్’ రూ.50 వేల సాయం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ.వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతుండగా.. అతడి కుటుంబానికి ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తన నామా ట్రస్ట్ ద్వారా రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించారు.
- నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు: ఖమ్మం మాజీ ఎంపీ నామా
ఖమ్మం కమాన్‌బజార్, ఆగస్టు 3: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ.వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతుండగా.. అతడి కుటుంబానికి ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తన నామా ట్రస్ట్ ద్వారా రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించారు. సదరు చెక్కును ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్ఎస్ నాయకులు కలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణుకుమార్‌కు సోమవారం అందజేశారు.
చికిత్స పొందుతున్న వేణుకుమార్‌ను ఇటీవల చూసి, అతడి పరిస్థితిని గమనించి చలించిపోయిన నామా.. తన నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ సాయం పంపారని కమల్‌రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నామా సందేశాన్ని వినిపించారు. ‘నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. రాష్ట్ర యువతకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని నామా సూచించి భరోసా ఇచ్చినట్లు చెప్పారు. చెక్కును అందించిన వారిలో కమల్రాజుతోపాటు ట్రస్ట్ ప్రతినిధి కనకమేడల సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు సామినేని హరిప్రసాద్, మోరంపూడి ప్రసాద్‌రావు, గడ్డం వెంకటేశ్వర్లు, వాకదాని కోటేశ్వరరావు, పెనుగొండ కొండలు, నాగరాజు, రేగళ్ల కృష్ణప్రసాద్, పగడాల రవికుమార్, షారుఖ్ ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

