నంగునూరు, సెప్టెంబర్ 13: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి ఆదిలోనే కష్టాలు మెదలయ్యాయి. బీఆర్ఎస్ హ యాంలో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని రూ.300 కోట్లతో 65 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్మించారు. రంగనాయకసాగర్ నీటి విడుదల చేసిన సందర్భంగా ఎల్డీ 9 ద్వారా ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలోకి నీరు అందేది. ఫ్యాక్టరీ ఆవరణలో నిర్మించిన నీటి ట్యాంకులో ఆ నీటిని నిల్వ ఉంచేవారు. దీంతో నీటి సమస్య ఉండేది కాదు. ప్రస్తుతం గోదావరి నీటిని పంపింగ్ చేయకపోవడంతో రంగనాయకసాగర్ ఎండిపోయింది. దీంతో ఈసారి పంటలు, ఫ్యాక్టరీకి నీరు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది.
ఈ ఏడాది మార్చిలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభమైన నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి ఆరు నెలలు తిరుగకముందే నీటి గండంలో చికుకోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనంగా మా రింది. ఫ్యాక్టరీ క్రషింగ్ కోసం రోజుకు 6 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా, రంగనాయకసాగర్ నీటి సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.
సెప్టెంబర్,అక్టోబర్ ఆయిల్‌పామ్ క్రషింగ్‌కు పీక్ సీజన్ కావడంతో ఫ్యాక్టరీ నిర్వహ ణ అగమ్యగోచరంగా మారింది. ఫ్యాక్టరీలోని 10 కోట్ల లీటర్ల కెపాసిటీ గల పాండ్ ఎండిపోవడంతో అధికారులు ప్రైవేట్ ట్యాంకర్లు, బోర్లపై ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. నీటి వనరులపై దృష్టి పెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఫ్యాక్టరీలో ఏర్పడిన నీటి కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారుల సూచనల మేరకు ప్ర త్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందిస్తున్నాం. ఇప్పటివరకు 10,500 టన్నుల క్రూడ్ ఆయిల్‌ను టన్నుకు రూ.1,30,000 చొప్పున విక్రయించాం.
– ప్రణీశ్ , నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఇన్చార్జి