Shubman Gill | వన్డేల్లో గిల్ సంచలనం.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో రికార్డు..!
Shubman Gill: వన్డే క్రికెట్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gil) ఎవరికీ సాధ్యమవ్వని రికార్డు సృష్టించాడు. తన ఫామ్, ఆటపై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ వేగవంతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు గిల్.
Shubman Gill: వన్డే క్రికెట్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gil) ఎవరికీ సాధ్యమవ్వని రికార్డు సృష్టించాడు. తన ఫామ్, ఆటపై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ వేగవంతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు గిల్. గువాహటి వన్డేలో వెస్టిండీస్ బౌలర్లను ఉతికేసిన టీమిండియా సారథి 117 బంతుల్లోనే ద్విశతం సాధించాడు. దాంతో.. ఈ ఫార్మాట్లో అత్యంత తక్కువ బంతుల్లో రెండొందలు కొట్టిన ఇషాన్ కిషన్ రికార్డు బద్ధలైంది. ఇషాన్ 126 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా.. గిల్ క్లాస్ ఇన్నింగ్స్‌తో నయా చరిత్ర లిఖించాడు.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కసికొద్ది కొట్టాడు. గువాహటి వన్డేలో విండీస్ బౌలర్ల భరతం పట్టిన భారత సారథి.. 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. మెరుపు వేగంతో ఆడిన గిల్.. ఫాస్టెస్ట్ ద్విశతకంతో రికార్డు నెలకొల్పాడు. అతడి ధాటికి 2022లో బంగ్లాదేశ్‌పై126 బంతుల్లో రెండొందలు కొట్టిన ఇషాన్ కిషన్ రెండో స్థానానికి పడిపోయాడు.
India vs West Indies, 2nd ODI | Captain Shubman Gill hits his second double century.
(Pics: ANI Picture Service) pic.twitter.com/yb562ETVmh
— ANI (@ANI) September 30, 2026
వీళ్లే ఫాస్టెస్ట్
వన్డేల్లో అత్యంత తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ బాదిన వాళ్లలో భారత ఆటగాళ్లు గిల్, ఇషాన్ వరసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(ఆస్ట్రేలియా, 128 బంతులు)మూడో స్థానంలో నిలవగా, పథుమ్ నిశాంక(శ్రీలంక, 136 బంతులు), మాజీ విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్(138 బంతులు) ఐదులో కొనసాగుతున్నారు. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్.. అంతర్జాతీయ వన్డేల్లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత అత్యధిక డబుల్ సెంచరీలు కొట్టిన క్రికెటర్‌గా అవతరించాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో మూడు ద్విశతకాలు ఉండగా.. గిల్ పేరిట రెండు ఉన్నాయి.
𝗠𝗔𝗝𝗘𝗦𝗧𝗜𝗖. 𝗠𝗔𝗥𝗩𝗘𝗟𝗢𝗨𝗦. 𝗠𝗔𝗚𝗡𝗜𝗙𝗜𝗖𝗘𝗡𝗧 🫡
Shubman Gill becomes just the 2️⃣nd Indian to score multiple ODI double hundreds 👏👏
Updates ▶️ https://t.co/6XCYRtZLAi#TeamIndia | #INDvWI | @mflone_ | @ShubmanGill pic.twitter.com/e6MCoUfNbV
— BCCI (@BCCI) September 30, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

