IND vs WI : గువాహటిలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో కదంతొక్కగా.. సారథి గిల్ ద్విశతకంతో విరచుకుపడ్డాడు. విండీస్ బౌలర్లకు వణుకుపుట్టిస్తూ బౌండరీలతో చెలరేగిన అతడితో రుతురాజ్ గైక్వాడ్(31 నాటౌట్) ఆఖరి దాకా నిలబడ్డాడు. కొండంత లక్ష్యాన్ని కరిగించి.. 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
వెస్టిండీస్‌తో మూడు వన్డేలసిరీస్‌లో అదిరే బోణీ కొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌లో రికార్డు లక్ష్యాన్ని ఉఫ్‌మనిపించింది. టాపార్డర్‌లో ముగ్గురు సెంచరీలో భారత్‌కు 406 పరుగులతో సవాల్ విసిరిన విండీస్ బౌలర్ల వైఫల్యంతో కంగుతిన్నది. రికార్డు ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) బ్యాట్ ఝులిపిస్తూ శతకంతో మెరవగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(223 నాటౌట్) శివతాండవం చేశాడనుకో. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపిన గిల్, హిట్‌మ్యాన్ తొలి వికెట్‌కు ఏకంగా 255 పరుగులతో గెలుపు పునాది వేశారు.
𝗠𝗔𝗝𝗘𝗦𝗧𝗜𝗖. 𝗠𝗔𝗥𝗩𝗘𝗟𝗢𝗨𝗦. 𝗠𝗔𝗚𝗡𝗜𝗙𝗜𝗖𝗘𝗡𝗧 🫡
Shubman Gill becomes just the 2️⃣nd Indian to score multiple ODI double hundreds 👏👏
Updates ▶️ https://t.co/6XCYRtZLAi#TeamIndia | #INDvWI | @mflone_ | @ShubmanGill pic.twitter.com/e6MCoUfNbV
— BCCI (@BCCI) September 30, 2026
ఈ ఫార్మాట్లో 35వ శతకం తర్వాత రోహిత్ ఔటయ్యాక విరాట్ కోహ్లీ(29 నాటౌట్)తో ఇన్నింగ్స్ నిర్మించిన సారథి.. వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. 117 బంతుల్లోనే రెండో ద్విశతకం సాధించిన అతడు.. ఇషాన్ కిషన్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. కోహ్లీ వెనుదిరిగినా ఆఖరి వరకూ క్రీజులో నిలిచిన గిల్ భారత్‌కు 8 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు. వన్డే చరిత్రలో ఐదు సెంచరీలు నమోదైన మ్యాచ్‌లో భారీ విజయంతో మరో గేమ్ ఉండగానే టీమిండియా సిరీస్‌ను ఒడిసిపట్టింది.
స్వదేశంలో వరసగా రెండో వన్డేలోనూ భారత బౌలర్లు తేలిపోయారు. గువాహటిలో వెస్టిండీస్ బ్యాటర్లను నిలువరించలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భీకర ఫామ్ కొనసాగిస్తూ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్(101) వేగంతమైన సెంచరీతో దడ పుట్టించగా.. ఆపై కెప్టెన్ షాయ్ హోప్(104), అమిర్ జంగూ(114)లు సైతం ధనాధన్ ఆటతో సెంచరీలు సాధించారు.
క్రీజునంటుకున్న ఈ జోడీ వికెట్ తీసే టీమిండియా బౌలర్ కరువవ్వగా విండీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ ముగ్గురి వీరకొట్టుడుతో విండీస్ స్కోర్ 38 ఓవర్లకే మూడొందలు దాటింది. ఆఖర్లో రోస్టన్ ఛేజ్(29 నాటౌట్) మెరుపులతో పర్యాటక జట్టు శుభ్‌మన్ గిల్ సేన ముందు 406 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిలిపింది.
జంగూ(114), క్యాంప్‌బెల్(101), హోప్(104)
