రాయపోల్, మార్చి 15 : రాయపోల్ మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వరప్రసాద్ తన తండ్రి జన్మదినం సందర్భంగా రక్తదానం (Blood Donation) చేసి ఆదర్శంగా నిలిచారు. హిందీ టీచర్‌గా పనిచేస్తున్న ఆయన తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకునేందుకు ఆయన రక్తదాతగా మారారు. ఆదివారం తన తండ్రిబాల్ నర్సయ్య జన్మదినం కావడంతో వరప్రసాద్ రక్తదానం చేసి సేవా భావాన్ని ప్రదర్శించారు.
రక్తదానం అనంతరం టీచర్ వరప్రసాద్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో మంది ప్రాణాలను కాపాడగలదని, అందుకే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన సూచించారు. తన
తండ్రి జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తాయని వరప్రసాద్ పేర్కొన్నారు. రక్తదానం చేసిన ప్రసాద్‌ను స్నేహితులు, పరిచయస్తులు అభినందించారు.