హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతం ఎగువన తుఫాను వలయం ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ర్టాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఈ తుఫాను వలయం అల్పపీడనంగా మారే అవకాశమున్నదని అంచనా వేసింది.