Virat Kohli : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli ) మరో మైలురాయిని అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక శతకాలతో ఇప్పటికే రికార్డు నెలకొల్పిన విరాట్ ఈసారి.. 15వేల క్లబ్లో చేరాడు. అంతర్జాతీయంగా వన్డేల్లో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లీ అవరించాడు. వెస్టిండీస్‌తో తిరువనంతపురం వన్డేల్లో బౌండరీతో అరుదైన ఫీట్ సొంతం చేసుకున్నాడీ రన్ మెషీన్. తద్వారా.. 50 ఓవర్ల ఫార్మాట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత 15,000 రన్స్ కొట్టిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
వన్డేల్లో రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. తనకెంతో ఇష్టమైన ఈ ఫార్మాట్లో అతడు 15వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆదివారం తిరువనంతపురం వన్డేలో అర్జారీ జోసెఫ్ ఓవర్లో బౌండరీ బాదిన కోహ్లీ.. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలురాయిని అందుకున్నాడు.
HISTORY MADE IN THIRUVANANTHAPURAM 🔥
15,000 ODI RUNS FOR CHASE MASTER KING KOHLI ❤️
VIRAT KOHLI ACHIEVED IN 303 ODI INNINGS 🚀 #ViratKohli #KingKohli #INDvWI #ODICricket #1stODI
[India vs West Indies 1st ODI, King Kohli, 15K ODI RUNS]
pic.twitter.com/5rEmbLgpfm— Vikas Kohli (@imvikaskohli) September 27, 2026
వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డును బద్ధలు కొట్టిన మాజీ సారథి.. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తర్వాత ఇన్నేసి పరుగులు బాదిన క్రికెటర్‌గా రికార్డు పట్టేశాడు. పదిహేను వేల పరుగుల కోసం సచిన్ 377 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. విరాట్ 303 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ క్లబ్లో చేరాడు. ప్రస్తుతం సచిన్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
#ViratKohli etches his name into another elite record! 👑
15,000 ODI runs in just 303 innings, faster than anyone before him! 🐐
A landmark only two have ever reached! 🔥#INDvWI 1st ODI 👉 LIVE NOW 👉 https://t.co/zk2ABY21JG pic.twitter.com/4JD71yGDG3
— Star Sports (@StarSportsIndia) September 27, 2026