హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీబీఎస్ఈ క్లస్టర్-7 టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన యంగ్ ప్యాడ్లర్ రిద్ధి తోరో సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జరిగిన ఈ టోర్నీ అండర్-14 బాలికల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. బండ్లగూడ జాగీర్‌లోని టైమ్స్ స్కూల్ కు చెందిన రిద్ధి ఫైనల్లో 3-1 (7-11, 11-9, 11-8, 11-5) తో విజయవాడ ప్యాడ్లర్ హేత్వికపై విజయం సాధించింది. బా లికల అండర్-14 టీమ్ ఈవెంట్లో రిద్ధి తోరో, వంశిక, అనన్యతో కూడిన టైమ్స్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది.