Ketan Murder case | ‘వాడికి పట్టినగతే నీకూ పడుతుందని బెదిరించాడు’.. కేతన్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వెల్లడి..!
Ketan Murder case | మహారాష్ట్ర (Maharastra) లోని పుణె నగరం (Pune City) లో జరిగిన కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య అప్పట్లో సంచలనం రేపింది. ఈ హత్య కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌లో పోలీసులు కీలక విషయాలను పేర్కొన్నారు. కేతన్‌ను చేతన్ కోట అంచుపై నుంచి తోసేయడాన్ని తాను చూశానని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు తెలిపారు.
Ketan Murder case : మహారాష్ట్ర (Maharastra) లోని పుణె నగరం (Pune City) లో జరిగిన కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య అప్పట్లో సంచలనం రేపింది. ఈ హత్య కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌లో పోలీసులు కీలక విషయాలను పేర్కొన్నారు. కేతన్‌ను చేతన్ కోట అంచుపై నుంచి తోసేయడాన్ని తాను చూశానని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు తెలిపారు. సాక్షి చెప్పినట్లుగా పోలీసులు వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ‘నేను నా స్నేహితుడి కుటుంబంతో కలిసి లోహ్‌గఢ్ కోట (Lohgarh Fort) చూడడానికి వెళ్లాను. మెట్లు ఎక్కుతున్న సమయంలో కేతన్, సియా గోయల్ (Siya Goel) మా ముందు నుంచే నడుచుకుంటూ వెళ్లారు. వారి వెనుకనే చేతన్ (Chetan) అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు’ అని సాక్షి చెప్పాడు.
ఇంకా కొనసాగిస్తూ.. ‘చేతన్ అనుమానాస్పదంగా కనిపించడంతో తాను అతడి వద్దకు వెళ్లి ఇంత ఎండలో హుడీ ఎందుకు వేసుకున్నావని అడిగాను. అతడు ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి, ఓ ఆలయం దగ్గర కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత కోట అంచు వద్ద సియా కూర్చొని ఉండగా.. కేతన్ ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఆమె చేతన్‌కు వేలు చూపిస్తూ ఏవో సైగలు చేసింది. అనంతరం కేతన్ కాలిపై గట్టిగా తన్నింది. వెంటనే చేతన్ పరుగెత్తుకుంటూ వెళ్లి కేతన్‌ను లోయలోకి తోసేశాడు’ అని ఆ సాక్షి వెల్లడించాడు.
ఇంకా చెబుతూ.. ‘ఈ హఠాత్పరిణామంతో నేను షాక్‌కు గురయ్యా. వెంటనే వారి వద్దకు వెళ్లి అతడిని ఎందుకు తోసేశారని ప్రశ్నించా. కానీ వాళ్లు నన్ను బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే కేతన్కు పట్టిన గతే నీకూ పడుతుందని చేతన్ హెచ్చరించాడు. దాంతో నేను భయపడి ఇంటికి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఈ హత్యపై మీడియాలో వచ్చిన కథనాలు చూసి.. పోలీసులను సంప్రదించి అసలు విషయం చెప్పాను’ అని వెల్లడించాడు.
కాగా ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. సియాకు కేతన్‌తో పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఆమె ప్రియుడు చేతన్ సహాయంతో ఈ హత్యకు ప్రణాళిక రచించిందని నిర్ధారించారు. నిందితులు పక్కా ప్లానింగ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా కేతన్‌ను లోహ్‌గఢ్ కోటకు తీసుకువచ్చి హత్యచేశారని తెలిపారు. నిందితులు వినియోగించిన ఆరు మొబైల్ ఫోన్లు, తొమ్మిది పెన్ డ్రైవ్‌లు, బ్యాకప్‌లు, కాల్ రికార్డులు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ కేసులో కీలక ఆధారాలు లభ్యమైనట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

